మరోసారి రూ.1 లక్షల మార్క్‌కు దాటిన జిఎస్‌టి వసూళ్లు

SMTV Desk 2019-05-05 16:37:44  gst, goods and services tax, gst collections

న్యూఢిల్లీ: జిఎస్‌టి వసూళ్లు మరోసారి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. నాలుగు నెలల్లో మూడోసారి కూడా రూ.1 లక్షల మార్క్‌ను మించి వసూళ్లు రాబట్టాయి. ఏప్రిల్‌లో నెల లో రూ.1.13 లక్షల కోట్లతో వసూళ్లలో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. గత నెలలో జిఎస్‌టి వసూళ్లు రూ.1.06 కోట్లుగా ఉండగా ఏప్రిల్‌లో వసూళ్లు మాత్రం జీవితకాల గరిష్టానికి చేరాయి. 2019 ఏప్రిల్‌లో రూ.1,13,865 కోట్ల జిఎస్‌టి ఆదాయం వసూలైంది. దీనిలో కేంద్ర జిఎస్ టి రూ.21,163 కోట్లు, రాష్ట్ర జిఎస్‌టి రూ.28,801 కోట్లు, ఉమ్మడి జిఎస్‌టి రూ.54,733 కోట్లు, సెస్ రూ.9,168 కోట్లు ఉంది. ఏప్రిల్ 30 వరకు మొత్తం సేల్స్ రిటర్న్ జిఎస్‌టిఆర్3బి సంఖ్య 72.13 లక్షలుగా ఉంది. 201920 ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్ తొలి నెల. అయితే జిఎస్‌టిని ప్రారంభించినప్పటి నుంచి తొలిసారిగా అత్యధికంగా జిఎస్‌టి వసూళ్లు వచ్చింది ఏప్రిల్ నెలలోనే కావడం విశేషం.