'వన్‌ప్లస్ 7 ప్రొ' బుకింగ్స్ స్టార్ట్

SMTV Desk 2019-05-05 16:02:37  oneplus, oneplus 7 pro, amazon, amazon opens oneplus 7 pro smartphone bookings

వన్‌ప్లస్ కంపెనీ తన నూతన వన్‌ప్లస్ 7 ప్రొ స్మార్ట్‌ఫోన్లను భారత్‌లో మే 14న రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫోన్ అమ్మకాలకు సంబంధించిన ప్రీ-బుకింగ్స్‌ను ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా తాజాగా ప్రారంభించింది. ప్రీ బుకింగ్ చేసుకునే వారికి వ‌న్‌ప్లస్ 7 ప్రొ ఫోన్లను ముందుగా కొనుగోలు చేసేందుకు అవ‌కాశం లభిస్తుంది. ప్రీ బుకింగ్స్ చేసుకునే వారికి రూ.1వేయి విలువైన గిఫ్ట్ కూప‌న్‌ను కూడా అందిస్తున్నారు. అలాగే రూ.15వేల విలువైన స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ప్లాన్‌ను కూడా ఉచితంగా అందివ్వనున్నారు. వన్‌ప్లస్ స్టోర్లతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న క్రోమా, రిలయన్స్ సోర్లలో మే 8 నుంచి వన్‌ప్లస్ 7 ప్రొ ప్రీ-బుకింగ్ మొదలుకానుంది. ఇందుకుగాను రూ.2000 చెల్లించాల్సి ఉంటుంది. ఫోన్ కొనేటప్పుడు ఈ మొత్తాన్ని రీడీమ్ చేస్తారు. వన్‌టైమ్ యాక్సిడెంటల్ స్క్రీన్ రిప్లేస్‌మెంట్ ఆఫర్ కూడా వర్తిస్తుంది. వన్‌టైమ్ స్క్రీన్ రిప్లేస్‌మెంట్ ఇన్స్యూరెన్స్ కింద ప్రాసెసింగ్ ఫీజుగా రూ.750 చెల్లించాల్సి ఉంటుంది.