దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో హైఅలెర్ట్!

SMTV Desk 2019-04-27 11:52:18  south india, south states, tamilnadu, telangana, andhrapradesh, karnataka, puducherry, goa, maharastra, kerala

హైదరాబాద్: దక్షిణ భారత దేశంలోని నగరాలకు ఉగ్రవాదుల కుట్ర పొంచి ఉందని పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. తాజాగా కర్నాటక పోలీస్ కంట్రోల్ రూంకు ఓ లారీ డ్రైవర్ ఫోన్ చేశాడు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, పాండిచ్చేరి, గోవా, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో 19 చోట్ల రైళ్లలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందంటూ హెచ్చరించాడు. దీంతో అప్రమత్తమైన కర్నాటక పోలీసులు.. అన్ని దక్షిణాది రాష్ట్రాల డీజీపీలకు సమాచారం అందించారు. దక్షిణాది రాష్ట్రాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు.