కాళేశ్వరం వెట్‌ రన్ విజయవంతం

SMTV Desk 2019-04-24 15:42:23  kaleshwaram project, kaleshwaram project wet run

కాళేశ్వరం: బుధవారం ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతల పథకంలో భాగంగా మరో కీలక ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. అత్యంత కీలకమైన ఆరో ప్యాకేజీ నందిమేడారంలో భారీ మోటార్‌ వెట్‌ రన్ విజయవంతమైంది. సాంకేతిక ప్రక్రియలన్నీ పూర్తి కావడంతో అధికారులు మొదటి మోటార్ వెట్‌ రన్ ను నిర్వహించారు. నందిమేడారం సర్జ్‌ పూల్ నుంచి రిజర్వాయర్‌ లోకి నీటిని విడుదల చేశారు. సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సభర్వాల్, ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు. నందిమేడారం టన్నెల్‌ లోని పంప్‌ హౌజ్ లో 124.4 మెగావాట్ల సామర్థ్యమున్న ఏడు మోటార్లను ఏర్పాటు చేశారు. వాటిలో 3 మోటార్ల డ్రై రన్ ఇదివరకు చేపట్టగా… మొదటి మోటార్‌ వెట్‌ రన్‌ ను సక్సెస్ ఫుల్ గా నిర్వహించారు.