సింగరేణికి సిఎండికి అంతర్జాతీయ అవార్డు

SMTV Desk 2019-04-15 10:46:13  singareni, singareni collarys company private limited, singareni cmd nadiminti sridhar

కొత్తగూడెం: రాష్ట్ర సింగరేణి సంస్థ అంతర్జాతీయ అవార్డును సాధించింది. శుక్రవారం బ్రిటన్ కుచెందిన అచీవ్‌మెంట్స్‌ఫోరం సంస్ధ మేనేజర్ ఆఫ్‌ది ఇయర్ అవార్డును లండన్‌లో సింగరేణి సిఎండి నడిమింటి శ్రీధర్‌కు ప్రదానం చేసింది. సింగరేణి సంస్థలు గత ఐదేళ్లలో అభివృద్ధి పధంలో ఉన్నత శిఖరాలకు చేర్చిన సిఎండి శ్రీధర్‌కు బ్రిటన్‌కు చెందిన వృత్తి విద్యా నైపుణ్య, వినూత్న ఆలోచనల ప్రొత్సాహక వేదికైన అచీవ్‌మెంట్స్‌ఫోరం వారు ఈ అవార్డును అంతర్జాతీయ స్థాయిలో ఇచ్చే మేనేజర్ ఆఫ్‌ది ఇయర్ అవార్డును ఆయనకు బహూకరించారు. అనంతరం సిఎండి శ్రీధర్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ గత కొన్నేళ్లుగా సాధిస్తోన్న అధ్భుతమైన ప్రగతి, దీనికోసం అమలు చేస్తోన్న విధానాలు తదితర అంశాలు వెల్లడించారు.సింగరేణిలో అధికారులు, కార్మికులు, ఉద్యోగులు, సమష్టి కృషి , పట్టుదల వల్లనే సంస్థ ఈ స్థాయికి చేరుకోగలిగిందన్నారు. అంతకుముందు జర్మనీ దేశంలో మ్యూనిచ్‌లో జరిగిన ప్రపంచ ప్రసిధ్ధిచెందిన ట్రేడ్‌ఫెయిర్ బవుమాలో ఆయన పాల్గొన్నారు. ఇండియాడే సింపోజియంలో శ్రీధర్ ముఖ్యవక్తగా పాల్గొని దేశంలోని బొగ్గు పరిశ్రమ ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తు అనే అంశంపై ప్రసంగించారు. ఇందులో 58 దేశాల 3500 కంపెనీలు అత్యాధునిక మైనింగ్ సాంకేతికత, కొత్త యంత్రాలు, కొత్తసాధనాలు తమస్టాల్స్ ప్రదర్శించాయి.