ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల నగారా మోగింది

SMTV Desk 2019-04-14 12:02:43  mptc elections, zptc elections, telangana

హైదరాబాద్: రాష్ట్రంలో వరుసగా ఎన్నికల జోరు కొనసాగుతుంది. కొద్ది రోజుల క్రితమే శాసనసభ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇక రెండు రోజుల ముందు లోక్‌సభ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టకముందే మరో ఎన్నికలు వచ్చాయి. త్వరలో పదవీకాలం ముగియనున్న ఎంపిటిసి, జడ్పిటిసి స్థానాలకు ఈ నెల 22 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని మొత్తం 5857 ఎంపిటిసి స్థానాలు, 535 జడ్పిటిసి స్థానాలు ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాతే ఎంపిటిసి, జడ్పిటిసి ఓట్ల లెక్కింపు చేపడతారు.

మొదటి దశ పోలింగ్‌ తేదీ: 06.05.2019

రెండో దశ పోలింగ్‌ తేదీ: 10.05.2019

మూడో దశపోలింగ్‌ తేదీ: 14.05.2019