పుస్తక ప్రియులకు కోసం ఎయిర్‌టెల్‌ ఇ-బుక్స్

SMTV Desk 2019-04-14 11:50:53  airtel, airtel e-books app

ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్‌టెల్‌ పుస్తక ప్రియులకు ఓ శుభవార్త తెలిపింది. ఎయిర్‌టెల్‌ స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా పుస్తకాలు చదివేలా ఓ యాప్‌ను రూపొందించింది. దేశంలోని స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్ల కోసం ఇ-బుక్స్ యాప్‌ను తాజాగా లాంచ్ చేసింది. ఈ యాప్‌లో దాదాపు 70వేల‌కు పైగా పుస్త‌కాల‌ను పొందుపరుస్తుంది. కేవలం ఎయిర్‌టెల్‌ కస్టమర్స్‌ ఏ కాకుండా.. నాన్ ఎయిర్‌టెల్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంల‌పై కూడా.. ఎయిర్‌టెల్ ఇ-బుక్స్ యాప్ ల‌భిస్తుంది. ఎయిర్‌టెల్ ఇ-బుక్స్ యాప్ ను ఏ క‌స్ట‌మ‌ర్ అయినా స‌రే మొదటి 30 రోజులు ట్ర‌య‌ల్ పీరియ‌డ్‌లో పుస్తకాలు చదవొచ్చు. ఆ త‌రువాత నుంచీ నెల‌వారీగా రుసుం చెల్లించాల్సి ఉంటుంది. 6 నెల‌ల‌కు అయితే రూ.129., 12 నెల‌ల‌కు అయితే రూ.199 చెల్లించి ఈ యాప్‌ ద్వారా.. పుస్తకాలు చ‌దువుకోవ‌చ్చు. ఇక ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్ల‌యితే.. 5 పెయిడ్ పుస్త‌కాలు ఉచితంగా ల‌భిస్తాయి. ఈ యాప్ ద్వారా క‌స్ట‌మ‌ర్లు త‌మ‌కు కావ‌ల్సిన బుక్స్‌ను చదువుకోవడంతో పాటు కావాలని అనిపిస్తే వాటిని కొనుక్కోవచ్చు కూడా.