స్పైస్‌జెట్‌లోకి 16 బోయింగ్‌ విమానాలు

SMTV Desk 2019-04-14 10:45:07  spacejet, jet airways, boing 737 max

న్యూఢిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌, బోయింగ్‌ 737 మాక్స్‌ విమానాలు నిలిపివేయడంతో దేశంలో విమానాలు అందుబాటులో లేకుండా పోయాయి. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ త్వరలోనే 16 బోయింగ్‌ విమానాలను అందుబాటులోకి తీసుకురానుంది. 16 బోయింగ్‌ 737800 ఎన్‌జీ విమానాలను డ్రై లీజు కింద సంస్థలోకి తీసుకుంటున్నట్లు స్పైస్‌జెట్‌ వెల్లడించింది. ఈ విమానాలను దిగుమతి చేసుకునేందుకు అవసరమైన నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌(ఎన్‌ఓసీ) కోసం డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు సంస్థ తెలిపింది. మరో పది రోజుల్లో ఈ విమానాలు సంస్థలోకి చేరుతాయని పేర్కొంది. కాగా.. ఈ వార్తల నేపథ్యంలో సంస్థ షేర్లు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి.