రేపటి నుండి పాఠశాలలకు సెలవులు

SMTV Desk 2019-04-12 18:25:31  telangana schools summer holidays 2019, summer holidays, telangana state government

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్య శాఖా శనివారం (ఏప్రిల్ 13) నుంచి వేసవి సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకూ శనివారం నుంచి మే 31 వరకూ సెలవులు ఇస్తూ ప్రకటనను విడుదల చేసింది. ఈ 50 రోజులూ అన్ని స్కూళ్లనూ విధిగా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇంటర్ లోకి ప్రవేశిస్తున్న విద్యార్థులకు స్పెషల్ క్లాసుల పేరిట ఎవరైనా స్కూళ్లు నడిపిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే, పలు ప్రముఖ విద్యా సంస్థలు ఇంటర్ ప్రవేశం కోరుతున్న విద్యార్థులకు ముందుగానే క్లాసులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం.