ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు షాకిచ్చిన కావేరి ట్రావెల్స్

SMTV Desk 2019-04-10 10:58:17  andhra pradesh voters, travel buses, kaveri travels

అమరావతి, ఏప్రిల్ 10: ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు కావేరి ట్రావెల్స్ షాకిచ్చింది. చివరి నిమిషంలో ఏకంగా 125 బస్సులను రద్దు చేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. గురువారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని ఏపీ ఓటర్లు సొంతూళ్లు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పదో తేదీన (నేడు) ఊరు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. వీరిలా చాలామంది ప్రైవేటు ట్రావెల్స్‌ను నమ్ముకున్నారు. అయితే, కావేరి ట్రావెల్స్ యాజమాన్యం అకస్మాత్తుగా 125 బస్సులను రద్దు చేయడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు.

దీనికి తోడు తెలంగాణలో లైసెన్స్ లేదన్న కారణంతో తెలంగాణ ఆర్టీఏ అధికారులు మరికొన్ని ట్రావెల్స్ బస్సులను రద్దు చేశారు. దీంతో మొత్తంగా 200 వరకు బస్సులు నిలిచిపోయాయి. బస్సులు రద్దయ్యాయంటూ ప్రైవేటు యాజమాన్యాలు ప్రయాణికులకు మెసేజ్‌లు పంపడంతో ఇప్పటికిప్పుడు ఎలా వెళ్లాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.