క్రెడిట్ స్కోర్ తగ్గినా లోన్ పొందొచ్చు.....!!

SMTV Desk 2019-04-09 11:16:56  credit score, emi, credit card, investments, finance

క్రెడిట్ స్కోర్ ఎవరైనా లోన్ లేదా క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఇది చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. క్రెడిట్ స్కోర్ 750 లేదా ఆపైన ఉంటే అది మంచి స్కోర్. రీపేమెంట్ హిస్టరీ, క్రెడిట్ లిమిట్, రీపేమెంట్ ప్యాట్రన్, ప్రస్తుత ఈఎంఐలు వంటి వివిధ అంశాలు క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తాయి. ఈఎంఐలు సక్రమంగా కట్టడం, క్రెడిట్ కార్డు బిల్లులను తప్పకుండా చెల్లించడం, ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాలు ఉపయోగించుకోకపోవడం వంటి పలు అంశాల ద్వారా క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరుచుకోవచ్చు. క్రెడిట్ స్కోరు తక్కువగా ఉంటె లోన్ దొరకడం, ఈఎంఐలో ఏమైనా తీసుకోవడం వంటివి అసాధారణమైన పనులు. అయితే క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో లోన్ తీసుకోవచ్చు. మొదటిది.....గోల్డ్ లోన్: బంగారంపై రుణం తీసుకోవడం సులభం. ఇక్కడ మన వద్ద ఉన్న బంగారాన్ని తనఖా పెట్టా్లి. బంగారం విలువ ఆధారంగా మనకు వచ్చే రుణ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం బంగారం విలువలో 75 శాతం వరకు మొత్తాన్ని రుణం రూపంలో పొందొచ్చు. గోల్డ్ లోన్స్‌‌కు క్రెడిట్ స్కోర్‌తో అవసరం లేదు. రెండవది.....జాయింట్ లోన్: జాయింట్ లోన్లు కూడా తీసుకోవచ్చు. మీ భాగస్వామి లేదా బంధువులను కో-అప్లికెంట్‌గా చేర్చి రుణం తీసుకోవచ్చు. జాయింట్ లోన్స్‌ విషయంలో బ్యాంకులు ఇద్దరి క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేస్తాయి. మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉండి, మీ భాగస్వామి క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే రుణాన్ని ఆమోదం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మూడవది......కోలేటరల్ లోన్స్: వీటి విషయానికి వస్తే.. ఇందులో షేర్లు, ఎండోమెంట్ ప్లాన్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ప్రాపర్టీ, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి వివిధ రకాల ఇన్వెస్ట్‌మెంట్లను తనఖా పెట్టి రుణం పొందొచ్చు. ఇక్కడ అసెట్ వ్యాల్యూపై ఆధారపడి రుణ మొత్తం ఉంటుంది. కుటుంబ సభ్యులు/స్నేహితుల నుంచి రుణం: మీకు నగదు అత్యవసరమైతే కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల నుంచి డబ్బులు తీసుకోవచ్చు. మీరు మీ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడిన వెంటనే వారి డబ్బులు వారికి ఇవ్వడం ఆలస్యం చేయవద్దు. మీరు మీ స్నేహితులను డబ్బులు అడగడానికి ముందు చెప్పిన తేదీకి కచ్చితంగా డబ్బులు ఇచ్చేలా ప్లాన్ చేసుకోండి.