నిరుద్యోగులకు కేసీఆర్ స్వాతంత్ర్య దినోత్సవ కానుక..

SMTV Desk 2017-08-15 12:47:23  kcr, indipendence day, unemployees, jobs notifications

హైదరాబాద్, ఆగస్ట్ 15 : 71వ స్వాతంత్ర్య దినోత్సవ౦ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు శుభవార్త ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 48,070 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ వెలువరించనున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రస్తుతం 1,12,536 ఉద్యోగాలను భర్తీ చేస్తోందని.. వాటిలో ఇప్పటికే 27,660 ఉద్యోగాలకు నియామక ప్రక్రియ చేపట్టినట్లు గుర్తు చేసారు. కేసీఆర్, కొత్తగా పోలీసు శాఖలో 27,440, ఉపాధ్యాయ వృత్తిలో 12,005, గురుకులాల్లో 12,436, ఆరోగ్య శాఖలో 8,347, సింగరేణిలో 1,970, రెవెన్యూ శాఖలో 2,506, వ్యవసాయ శాఖలో 1,418, అటవీ శాఖలో 2,033, ఎంఏయూడీలో 1,850, ఉన్నత విద్యాశాఖలో 1,673, నీటి పారుదల శాఖలో 1,053, ఆర్థిక శాఖలో 703, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 587, పంచాయితీ రాజ్ శాఖలో 3,528 పోస్టులను భర్తీ చేయనున్నామని వెల్లడించారు. వచ్చే ఏడాది ఏర్పడే ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ ఏడాదే నియామకం చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.