అత్యధికంగా తగ్గిన మారుతి విక్రయాలు

SMTV Desk 2019-04-01 17:33:45  maruti suziki, automobiles, maruti suziki gypsy, maruti cars

ముంబయి : మారుతి సుజుకీ కార్లు మార్చి నెలలో విక్రయాలు తీవ్రంగా పడిపోయాయి. ఈ నెలలో విక్రయాలు 1,58,076కు తగ్గాయి. అయితే 2018 సంవత్సరం మార్చితో పోల్చుకుంటే 1,60,598 నమోదయ్యాయి. వీటిల్లో ఒక్క దేశీయ విక్రయాల్లోనే 0.7శాతం తగ్గుదల నమోదైంది. ఇక విదేశీ విక్రయాల్లో దాదాపు 13శాతం తగ్గి 10,463 యూనిట్లుగా మారింది. గత ఏడాది మార్చిలో 12,016 యూనిట్లను విక్రయించారు. కానీ 201819 సంవత్సరం మొత్తానికి చూసుకుంటే మారుతీ విక్రయాలు 4.7శాతం పెరిగి 18,62,449కు చేరాయి. మారుతీ విక్రయాల్లో పెరుగుదల కనిపించడం వరుసగా ఇది ఏడోసారి.