టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్‌ లిస్టులో హరీశ్ రావు

SMTV Desk 2019-03-26 11:25:25  

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) స్టార్ క్యాంపెయినర్‌గా హరీశ్ రావును ఎంపిక చేసింది పార్టీ అధిష్టానం. రాజ్యసభ సభ్యులు జె. సంతోష్ కుమార్ స్థానంలో హరీశ్ రావు ఎన్నికయ్యారు. నిన్న జరిగిన స్టార్ క్యాంపెయినర్ లిస్టులో ఆయన పేరు లేదు. ఈ నేపథ్యంలోనే లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసే నేతల జాబితాలోనూ హరీశ్‌ పేరు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఏమైందో తెలియదు గానీ అనూహ్యంగా స్టార్ క్యాంపెయినర్‌ లిస్టులో హరీశ్ రావు పేరు వచ్చింది.

లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది టీఆర్ఎస్. అందుకు పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్తోంది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం పర్వం వరకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లోంది. ఈ క్రమంలోనే ప్రచారంలో పాల్గొనేందుకు 20మందిని ఎంపిక చేసింది. ఈ జాబితాలో కేటీఆర్, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, టి.రవీందర్ రావు, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, వి.ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, కె.కేశవరావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాస్ రెడ్డి, ఆర్. శ్రావణ్ కుమార్, బండ ప్రకాశ్ పేర్లు ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో జె. సంతోష్ కుమార్ స్థానంలో హరీశ్ రావు పేరు కూడా చేరింది.