నిజామాబాద్ ఎంపీ కవితపై పోటీకి వెయ్యి మంది

SMTV Desk 2019-03-18 12:46:15  Nizamabad, MP Kavitha

నిజామాబాద్, మార్చి 18: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితపై పోటీ చేసేందుకు ఏకంగా వెయ్యిమంది సిద్ధమవుతున్నారు. కవితపై పోటీకి దిగబోతున్నవారందరూ రైతులు కావడం గమనార్హం. కవితపై తమ నిరసనను తెలిపేందుకు ఈ సరికొత్త శైలిని వారు ఎంచుకున్నారు.

పసుపు, ఎర్రజొన్నకు మద్దతు ధర కోసం డిమాండ్ చేస్తున్న వీరంతా కవితపై మూకుమ్మడిగా పోటీకి దిగాలని రైతు సంఘాలు తీర్మానించాయి. కనీసం 500 నుంచి వెయ్యి వరకు నామినేషన్లు దాఖలు చేయాలని రైతులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎన్నిక రసవత్తరంగా మారనుంది.