రాజకీయ ఎత్తుగడలతో ప్రజలను మభ్యపెడుతున్న కెసిఆర్

SMTV Desk 2019-03-16 17:39:09  KCR, revanth reddy

హైదరాబాద్, మార్చ్ 16: గడిచిన తెలంగాణా ఎన్నికల్లో టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కెసిఆర్ , తెరాస పార్టీ పై ఓ రేంజ్ లో రెచ్చిపోయేవారు.తెలంగాణాలో తెరాస జెండా పీకేసి కాంగ్రెస్ జెండా పాతి తీరుతానని,తాను పోటీ చేసిన నియోజకవర్గంలో తనని ఓడించేది ఎవరని ఒక్కొక్కరికి చుక్కలు చూపించేలా సవాళ్లు విసిరేవారు,ఇంకా ఎన్నికలకు ఒక్క రోజు ముందు వరకు కొడంగల్ లో రేవంత్ కు ఎదురు లేదనే అందరు అనుకున్నారు,అన్ని అనూహ్యంగా రేవంత్ రెడ్డి ఘోర పరాజయం పాలయ్యారు.

కానీ ఇప్పుడు మళ్ళీ పార్లమెంటు ఎన్నికలకు ఎన్నికల కమిషన్ తేదీ కూడా ప్రకటించేసింది.దీనితో ఈ సారి రేవంత్ ను టీకాంగ్రెస్ మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.ఈ సందర్భంలోనే తన ఎన్నికల ప్రచారాన్ని కూడా షురూ చేసేసారు.అందులో భాగంగా మాట్లాడుతూ కెసిఆర్ పై మరోసారి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు.ఇప్పటి వరకు కెసిఆర్ హయాంలో సారా కారా కెసిఆర్ సర్కారా అంటే అసలు ఇక్కడ ప్రజలకు జరిగిన మేలు ఏముందో చెప్పాలని ప్రశ్నించారు.కెసిఆర్ తన రాజకీయ ఎత్తుగడలతో ప్రజలను మభ్యపెడుతున్నాడని ఇక అటు తిప్పి ఇటు తిప్పి చూసుకుంటే సారూ కారు కెసిఆర్ సర్కార్ బేకారు అయ్యిందని సంచలన వ్యాఖ్యలు చేసారు.