ఆఫీస్ స్పేస్‌లలో టాప్ లో హైదరాబాద్

SMTV Desk 2019-03-14 14:27:23  hyderabad, office spaces, top companys, property consultant colliers

హైదరాబాద్, మార్చ్ 14: హైదరాబాద్ లో బడా బడా కంపెనీలు తమ ఆఫీసులను ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ప్రాపర్టీ కన్సల్టెంట్ కొల్లియర్స్ నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలోని మిగతా రాష్ట్రాలకన్నా హైదరాబాద్‌కే డిమాండ్ ఎక్కువగా ఉందని తేలింది. ఇతర ప్రధాన నగరాలతో పోల్చితే నగరంలో ఆఫీసు అద్దెలు భారీగా పెరిగాయని ఆ సంస్థ చేసిన సర్వేలో పేర్కొంది. నివాస గృహాలు, ఆస్తుల ధరలు భారీగా పెరిగిన మెట్రో నగరాల సరసన ప్రస్తుతం హైదరాబాద్ కూడా చేరింది. తెలంగాణలో నివాసాలకు డిమాండ్ పెరగడంతో రియల్‌రంగం గణనీయమైన వృద్ధిని సాధిస్తోందని రియల్‌రంగ నిపుణులు పేర్కొంటున్నారు. 2018 సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు నిర్వహించిన సర్వేలో అద్దెలు 8 శాతం పెరిగినట్టు ఆ సంస్థ వెల్లడించింది. హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరు, కోల్‌కత్తాలో ఈ సర్వేను నిర్వహించి ఈ విషయాన్ని ఆ సంస్థ వెల్లడించింది. 2018 జవనరి నుంచి సెప్టెంబర్ వరకు ప్రముఖ నగరాల్లో అంతకుముందు ఉన్న అద్దెలతో పోల్చితే అక్టోబర్ నుంచి 2.5 శాతం అధికమయ్యాయని ఆ సంస్థ వెల్లడించింది.