చిరుమర్తి లింగయ్య పార్టీ మారడం భాద కలిగించింది

SMTV Desk 2019-03-08 13:44:49  Chirumarthi Lingaiah, Komatireddy Rajagopal Reddy, Congress MLA, Party Changing, TRS, MLA Ticket

హైదరాబాద్, మార్చి 8: కాంగ్రెస్ పార్టీ తరుపున గెలుపొందిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. రెండు మూడు రోజుల్లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. తాజాగా దీనిపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. చిరుమర్తి లింగయ్య పార్టీ మారడం చాలా బాధకలిగించిందని అన్నారు. లింగయ్య ఇంత నమ్మకద్రోహం చేస్తారని అనుకోలేదని అన్నారు. అతను పార్టీ మారుతున్నడన్నా సంగతి టీవీలో చూసేంతరకు తనకు తెలీదని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. లింగయ్యకు రెండు సార్లు పార్టీ టికెట్ ఇప్పించి, గెలుపు కోసం కృషి చేశానని గుర్తు చేసుకున్నారు.

ఈ విషయం పట్ల ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే లింగయ్య పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నారని వాపోయారు. ఆయన పార్టీ మారడం కాంగ్రెస్ కు పెద్ద ఎదురు దెబ్బే. అయితే పార్టీ విషయం కాకుండా, ఎక్కువ బాధ కోమటిరెడ్డి బ్రదర్స్ కే. చిరుమర్తి మొదటి నుండి కోమటిరెడ్డి వర్గానికి మంచి మద్దతుదారుగా నిలుస్తూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చిరుమర్తికి పార్టీ టిక్కెట్ వస్తుందో రాదో అన్న ఉహాగానాలు జరిగినప్పుడు కోమటి రెడ్డి బ్రదర్సే దగ్గరుండి చిరుమర్తికి టిక్కెట్ ఖరారు చేయించారు. ఇప్పుడు కనీసం కోమటిరెడ్డి బ్రదర్స్ ని సంప్రదించకుండానే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో...