మీరు బీరు ప్రియులా? అయితే ఈ రోజు మీదే!

SMTV Desk 2017-08-04 18:22:19  INTERNATIONAL BEERS DAY

హైదరాబాద్, ఆగస్ట్ 4 : మన భారతదేశంలో బీరు వినియోగం చాలా ఎక్కువనే చెప్పాలి. మద్య పానీయాలు ఎన్ని ఉన్నప్పటికీ అన్నింటికన్నా బీరుకు ఉన్న స్థానం మాత్రం చాలా ప్రత్యేకమైంది. ఇప్పడు బీరు గురించి ఎందుకు మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? ఈ రోజు బీరు ప్రియులకు ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈ రోజు "ఇంటర్నేషనల్ బీర్ డే" కాబట్టి. మొదట ఇది అమెరికాలోని కాలిఫోర్నియాలో చిన్న ఈవెంట్ గా ప్రారంభమై ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి వేడుకగా మారిపోయింది. అంతేకాకుండా 50 దేశాల్లో ఈ ఈవెంట్ ను జరుపుకుంటున్నారు. 2012 వరకు అంతర్జాతీయ బీర్ దినోత్సవాన్ని ఆగష్టు 5న జరుపుకున్నప్పటికీ ఆ తర్వాత నుంచి ఆగష్టు మాసం మొదటి శుక్రవారాన్ని బీర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ ఇంటర్నేషనల్ బీర్ డేకు మూడు లక్ష్యాలు కూడా ఉన్నాయట. అవేంటంటే.. స్నేహితులంతా కలిసి బీర్ ను టేస్ట్ చేయడం, బీరు తయారుచేసిన వారికి మరియు సేవలను అందించడానికి బాధ్యత వహించేవారికి థ్యాంక్స్ చెప్పడం, ఒకే రోజున అన్ని దేశాలకు చెందిన బీర్లను సేవిస్తూ, ప్రపంచం మొత్తాన్ని ఒకే వేదిక మీదకు తీసుకురావడం. ఈ ఈవెంట్ లో పాల్గొనే వారంతా ఒకరికొకరు బీర్లను గిఫ్ట్ లుగా కూడా ఇచ్చిపుచ్చుకుంటారట. బీర్ డేను జరుపుకుంటున్న దేశాల్లో మన దేశం కూడా ఉండటం గమనార్హం.