ఐఫోన్ కు పోటీగా.....శాంసంగ్ ఫోల్డబుల్ ఫీచర్ 'గెలాక్సీ ఫోల్డ్'

SMTV Desk 2019-02-21 15:09:07  

శాంసంగ్ నుండి ఫోల్డబుల్ ఫీచర్ తో "గెలాక్సీ ఫోల్డ్" స్మార్ట్ ఫోన్ విడుదలైంది, అధునాతన ఫోల్డబుల్ ఫీచర్ తో అందరిని ఆకట్టుకుంటుంది. 4380mAhతో రెండు బ్యాటరీలు కలిగి ఉన్న ఈ ఫోన్ 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ తో లభిస్తుంది. ఫోల్డ్ చేసి ఉన్నప్పుడు 4.6 ఇంచ్ డిస్ప్లే తో, అన్ ఫోల్డ్ చేస్తే 7.3 ఇంచ్ టాబ్లెట్ సైజులోకి మారటం దీని ప్రత్యేకత.

ఈ ఫోన్లో ఉన్న మరో ప్రత్యేకత "యాప్ కంటిన్యూవిటి" ఫీచర్. ఈ ఫీచర్ వల్ల మనం స్మాల్ స్క్రీన్ ఓపెన్ చేసిన యాప్ ను బిగ్ స్క్రీన్ లోకి మారాక కూడా అలాగే కంటిన్యూ చేయొచ్చు. అంతే కాకుండా, ఆండ్రాయిడ్ బృందం సహాయంతో శాంసంగ్ ప్రత్యేకంగా కస్టమైజ్ చేసిన ఈ ఫోన్ఆపరేటింగ్ సిస్టమ్, ఒకేసారి 3యాప్స్ ను ఉపయోగించుకునే వీలు కలిపిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ లో 6 కెమెరాలు ఉన్నాయి, మూడు కెమెరాలు ఫోన్ వెనక భాగాన, రెండు సైడ్ లో, ఒకటి ముందు భాగాన ఉన్నాయి. ఇన్ని ప్రీమియం ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్ ధర కూడా ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఉంది, $1000డాలర్ల ఫోన్ అనగానే షాక్ కు గురైన మనకు, $1980డాలర్ల ధరతో అందరిని నోళ్లు వెళ్ళబెట్టేలా చేస్తుంది. దీంతో పాటుగా శాంసంగ్ S10 సిరీస్ లో మరో ఫోన్ విడుదల చేసింది, ఈ ఫోన్ సాయంతో మరో ఫోన్ ను కూడా ఛార్జ్ చేసే కొత్త ఫీచర్ ను అందించింది.

"వైర్లెస్ పవర్ షేరింగ్" ఫీచర్ తో పాటుగా వీడియో స్టెబులైజేషన్ ఫీచర్ ను కూడా తీసుకొచ్చింది శాంసంగ్, ఈ ఫీచర్ ద్వారా మనం ఉన్న చోటు నుండి కదలకుండా, వైడ్ యాంగిల్, క్లోజప్ షాట్స్ తీసుకునే వెసలుబాటు ఉంది. అంతే కాకుండా వర్టికల్ యాంగిల్ లోనే గ్రూప్ ఫోటోను కవర్ చేసే ఫీచర్ కూడా ఉంది. మొత్తానికి శాంసంగ్ ఈ అధునాతన ఫీచర్లున్న ఫోన్లను లాంచ్ చేసి ఐఫోన్ కు గట్టి సవాల్ విసిరిందనే చెప్పాలి.