ఒక పెద్ద సైనికుడిలా పని చేస్తా: హరీష్ రావు

SMTV Desk 2019-02-20 19:49:43  

కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ మంత్రులందరికీ కూడా సిద్దిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే హరీష్ రావు తనదైన శైలి లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు… మన సీఎం కెసిఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజల కోరికలను, మన ప్రభుత్వానికి మంచి పేర తీసుకొస్తారని ఆశిస్తున్నాను అని తెలిపారు. ముఖ్యమంత్రి గారు ఆయా ప్రాంతాలు, అన్ని వర్గాలు, సమీకరణలు దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కెసిఆర్ గారు నాకు ఎలాంటి బాధ్యత అప్పగించినప్పటికీ కూడా నేను దాన్ని చాల క్రమశిక్షణతో పూర్తి చేస్తానని, నేను తెరాస పార్టీలో ఒక పెద్ద సైనికుడిలా పని చేస్తానని హరీష్ రావు అన్నారు.

కేసీఆర్ గారి ఆదేశాలను తప్పకుండా పాటిస్తానని నేను ఇదివరకే అందరికి తెలిపాను. కానీ ఎవరైనా సోషల్ మీడియాలో చెడుగా ప్రచారం చేస్తే దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను . అందరు కూడా పార్టీ కోసం చక్కగా పని చేసి మన పార్టీకి, ప్రభుత్వానికి చక్కటి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా హరీష్ రావు పిలుపునిచ్చారు.