ఫ్లెక్సీలు వద్దు, మొక్కలు ముద్దు

SMTV Desk 2019-02-14 08:45:12  Chandrasekhar Rao, KTR, TRS, KCR Birthday Celebrations

హైదరాబాద్, ఫిబ్రవరి 14: తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పుట్టిన రోజు ఈనెల 17న జరుపుకుంటున్న సందర్బంగా తెలంగాణా రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) నాయకులూ, కార్యకర్తలు, ఆయన అభిమానులకు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. అయితే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనికి సంబంధించి అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ పుట్టిన రోజున ఆయనను అభినందిస్తూ ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్స్ ఏర్పాటుకు, బొకేల కోసం డబ్బులు వృథా చేయొద్దని సూచించారు. ఇందుకు బదులుగా మొక్కలను నాటాలని ఆదేశించారు. తమ అభిమాన నాయకుడిపై ఉన్న ప్రేమను మొక్కలు నాటడం ద్వారా చాటిచెప్పాలని ఆ ట్వీట్ ద్వారా కేటీఆర్ పిలుపు నిచ్చారు.