ఉద్యోగం పేరిట మోసం.! బందీలుగా మారిన విద్యార్థులు

SMTV Desk 2017-08-03 11:43:30  STUDENTS HOUSE ARREST IN MAALDEEVES

హైదరాబాద్, ఆగష్టు 3 : నగరంలో రోజుకో కొత్త మోసం వెలుగు చూస్తోంది. కొన్ని ప్రైవేటు కంపెనీలు నిరుద్యోగ యువతను విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని, ఉద్యోగాల పేరిట ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. దీని వల్ల దేశం కాని దేశంలో విద్యార్థులు బందీలుగా మారవలసి వచ్చింది. వివరాలలోకి వెళితే.. ఆడియన్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ కళాశాలలో హోటల్ మేనేజ్ మెంట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో ఆ కళాశాల యాజమాన్యం మాల్దీవులలో ఉద్యోగాలు వచ్చాయని 17 మంది విద్యార్థుల నుంచి 1.1 కోట్ల రూపాయలు వసూలు చేశారు. వారికి వీసా, అపాయింట్ మెంట్ ఆర్డర్ కూడా అందించారు. విద్యార్థులను మాల్దీవులకు తీసుకెళ్ళిన యాజమాన్యం తరువాత జాడ లేకుండా పోయారు. దీంతో ఎన్నో ఆశలతో విదేశం వెళ్ళిన ఆ విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. హోటల్ రూం అద్దె చెల్లించలేదని ఆ హోటల్ యజమాని వారి పాస్ పోర్టులు లాక్కుని వారందరినీ ఒక గదిలో వేసి బంధించారు. దీంతో ఆ విద్యార్థులు తమను రక్షించాలని కోరుకుంటున్నారు.