చల్లా ధర్మారెడ్డికి మంత్రి పదవి...?

SMTV Desk 2019-02-08 10:28:56  Challa Dharma Reddy, Sahure Rajeshwar Rao, Ravindhar, Sambaiah, Kumaraswamy, Prabhakar, TRS, Cabinet Establishment

హైదరాబాద్, ఫిబ్రవరి 08: తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కేబినెట్ ఏర్పాటు చేయలేదన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కేబినెట్ లో మంత్రి పదవులను ఆశిస్తున్నవారి సంఖ్య పెరుగుతుంది. పరకాల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా రెండోసారి భారీ మెజారిటీతో గెలుపొందిన చల్లా ధర్మారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని వరంగల్ రూరల్ టీఆర్ఎస్ నేతలు పార్టీ హైకమాండ్ ను కోరారు.

ధర్మారెడ్డికి మంత్రి పదవి ఇస్తే వరంగల్ రూరల్ జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతుందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ధర్మారెడ్డికి కేబినెట్ లో చోటు కల్పించాకుంటే టీఆర్ఎస్ పార్టీనే నష్టపోతుందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు సాహురే రాజేశ్వర్‌రావు, రాయరాకుల రవీందర్‌, నాగనబోయిన సాంబయ్య, బొల్లోజు కుమారస్వామి, చెంచు ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.