ఆర్టికల్ పై స్పందించిన కవిత..

SMTV Desk 2019-02-06 18:38:44  kalvakuntla kavitha, Turmeric Farmers, MP Kavitha, TRS, asia net telugu

నిజామాబాద్, ఫిబ్రవరి 06: ఓ రచయిత రాసిన వ్యాసానికి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత స్పందించారు. కందుకూరి రమేష్ బాబు రాసిన ‘పసుపు రైతు కూలుస్తున్న పచ్చటి చెట్లు!’ వ్యాసానికి ఎంపీ కవిత స్పందించారు. “ఈ సమస్య మా అవగాహనలో ఉన్నది. అందుకే గత రెండేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం (టర్మరిక్ బాయిలర్ల వాడకానికి బదులుగా) స్టీం బాయిలర్ల కొనుగోలు కోసం రైతులకు రెండు లక్షల సబ్సిడీ ఇస్తోంది. నేను స్వయంగా కేంద్ర మంత్రితో మాట్లాడి మరో యాభైల వేల సబ్సిడీ ఇవ్వాలని కూడా కోరాను. నా విజ్ణప్తిని వారు ఇంకా పరిశీలిస్తున్నారు” అని ‘ఆసియా నెట్ తెలుగు’కు ఆమె తెలియజేశారు. కాగా “కోరిన రైతులందరికీ సబ్సిడీ అందేలా ఈసారి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది” అని కూడా ఆమె తెలిపారు.