తండ్రిని బెదిరించడానికే ఇదంతా... : విచారణలో విక్రమ్

SMTV Desk 2017-08-01 14:29:00  VIKRAM GOUD, MUKESH GOUD, INTRAAGATION

హైదరాబాద్, ఆగష్టు 1: మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పై కాల్పుల ఘటన రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. విక్రమ్ గౌడ్ పై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. అసలు విషయం ఏంటంటే.. ! తనపై జరిగిన కాల్పులను హత్యాయత్నంగా చూపించి, తాను తీర్చాల్సిన అప్పులకు తండ్రి ముఖేష్ గౌడ్ నుంచి డబ్బును తీసుకోవచ్చన్న ఆలోచనతో విక్రమ్ గౌడ్ స్వయంగా కాల్పుల డ్రామాకు తెరలేపాడని పోలీసులు తేల్చారు. తండ్రిని బెదిరించాలన్నదే విక్రమ్ ఆలోచన అని పోలీసులు వెల్లడించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్ ను పోలీసులు విచారణ చేయగా, జరిగిన మొత్తం విషయాన్నీ ఆయన నోటి నుండే బయటకు తెప్పించారు. తన తండ్రి నుంచి అవసరమైన డబ్బును తీసుకోవాలన్న ఆలోచనతో ఇదంతా చేసినట్టు విక్రమ్ వెల్లడించాడని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.