టిఆర్ఎస్ తరపున పోటీ: ఉపాసన

SMTV Desk 2019-01-28 18:19:24  Upasana, Ramcharan, Vishweshwar Reddy, Sangeetha Reddy

హైదరాబాద్, జనవరి 28: మెగాపవర్ స్టార్ రాంచరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియా లో చాలా చురుకుగా ఉంటారన్న విషయం తెలిసిందే. రాంచరణ్ గురించే కాకుండా, ఎన్నో తాజా విషయాలను ఆమె పంచుకుంటూ ఉంటారు. ఈమధ్య ఆమె గురించి వొక పత్రికలో వచ్చిన ఓ వార్తపై ఆమె సోషల్ మీడియా ద్వారా స్పందించారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేవెళ్ల ఎంపీ, టీఆర్ఎస్ తరపున ఉపాసన పోటీ చేయబోతున్నారనేదే ఆ వార్త కథనం. అయితే ఉపాసన ఈ వార్తను ఖండించారు. అందులో వాస్తవం లేదని చెప్పారు. ప్రస్తుతం చేస్తున్న జాబ్ ను తాను ఎంతగానో ఇష్టపడుతున్నాని ఆమె తెలిపారు. సంగీతా రెడ్డి w/o విశ్వేశ్వర్ రెడ్డి తన బాస్ అని చెప్పారు. చేవెళ్లలో తన చిన్నాన్న విశ్వేశ్వర్ రెడ్డి మంచి పనులు చేస్తున్నారని తెలిపారు