గోవుల్ని కాపాడిన ఎమ్మెల్యే ..!

SMTV Desk 2019-01-28 17:35:50  Rajasingh, BJP MLA, Gov rakshak committee, Cows, Gomatha, Shamirpet

హైదరాబాద్, జనవరి 28: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఈయన గోవు సంరక్షణ కార్యక్రమాల్లో చాలా చురుకుగా ఉంటారనే విషయం తెలిసిందే. తాజాగా అక్రమంగా తరలిస్తున్న 100 ఆవులను ఆయన కాపాడారు. ఈ రోజు ఉదయం సమయాన ఆవులను అక్రమంగా కబేళా కు తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న రాజాసింగ్, వొక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వ్యానును వెంబడించి హైదరాబాద్ శివార్లలో వున్న శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యానును అడ్డుకుని, వ్యానులో వున్న ఆవులను పరిశీలించారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ, ఆవులను చంపడం హిందూ ధర్మం కాదని, వాటిన రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు.