ఆతృతగా ఎదురుచుస్తున్నా : ఎంపీ

SMTV Desk 2019-01-28 17:29:20  Kavitha, Chandrasekhar Rao, KTR, Kavitha's twitter account

హైదరాబాద్, జనవరి 28: నిజామాబాద్ ఎంపీ కవిత, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు గారి కూతురు ప్రజలతో మమేకం అయ్యేందుకు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే ఆమె అన్న, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సోషల్ మీడియా వల్ల ప్రజలకు ఎంతో దగ్గరయ్యారు. కవిత గారు కూడా తన అన్నని అనుసరిస్తూ ప్రజలకు దగ్గరవతూ, వారి సమస్యల గురించి తెలుసుకునేందుకు ట్విట్టర్ ను ఆశ్రయించారు.

కవిత ఈ నెల 30వ తేదీన వొంటి గంటకు ట్విట్టర్ ద్వారా ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడనున్నట్లు...అందుకోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. తన అభిప్రాయాలను తెలంగాణ ప్రజలతో పంచుకోనున్నట్లు తెలిపారు.

ప్రజలు తమ సమస్యలను, సందేహాలను ఆస్క్ ఎంపీ కవిత (#AskMPKavitha) హ్యాష్ ట్యాగ్ తో పంపించవచ్చని...వాటికీ ట్విట్టర్ లైవ్ లో సమాధానం చెప్పనున్నట్లు కవిత పేర్కొన్నారు. ఈవిధంగా ట్విట్టర్ లైవ్ గురించి కవిత తన అధికారికి ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.