ఫేస్ బుక్ ద్వారా యువకులను మోసం చేసిన యువతి

SMTV Desk 2017-07-31 18:49:27  Facebook, police, money, arrest, pratyusha women, varangal , Fake Identity Card

వరంగల్, జూలై 31 : పొలీస్ అంటూ ఫేస్ బుక్ ద్వారా పరిచయాలు పెంచుకుని డబ్బు కజేస్తున్న ఓ మాయ లేడీని వరంగల్ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసముద్రం మండలానికి చెందిన ప్రత్యూష రెడ్డి అనే యువతి నకిలీ గుర్తింపుల కార్డులతో రెండేళ్లుగా మోసాలు చేస్తుంది. ఫేస్‌బుక్‌లో పలువురిని పరిచయం చేసుకొన్న యువతి తన ఆరోగ్యం బాగాలేదని చెప్పి, వారిని నమ్మించి డబ్బులు వసూలు చేసేదని సుబేదారి సీఐ శ్రీనివాస్‌ వెల్లడించారు. తాజాగా దుబాయిలో ఉంటోన్న ఓ వ్యక్తి నుంచి రూ.70వేలు తీసుకుందని పోలీసులు పేర్కొన్నారు. ఈ తరహ మోసాలను పసి గట్టిన పోలీసులు ఆమె వద్ద నుంచి 25 వేల నగదు, పోలీసు దుస్తులు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.