టీఆరెస్ తీర్థం పుచ్చుకోనున్న ఒంటేరు ప్రతాప్ రెడ్డి

SMTV Desk 2019-01-17 17:18:58  Onteru prathap reddy, TRS, Congress party, TDP, KCR

హైదరాబాద్, జనవరి 17: గత అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుండి కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఓటమి పాలైన వొంటేరు ప్రతాప్ రెడ్డి ఈ నెల 18న కేసీఆర్ సమక్షంలో తెరాసలోకి వెళ్లనున్నారు. 2009 ఎన్నికల్లో ప్రతాప్ రెడ్డి మహాకూటమి అభ్యర్ధిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నర్సారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా వొంటేరు ప్రతాప్ రెడ్డి కేసీఆర్‌పై పోటీ చేసి మళ్ళీ పరాజయ పాలైయ్యారు.

వొంటేరు ప్రతాప్ రెడ్డి టీడీపీలో ఉన్న సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతాప్ రెడ్డిని టీఆరెస్ లోకి రావాలని కోరారు. కాని ప్రతాప్ రెడ్డి టీడీపీలోనే కొంత కాలం కొనసాగారు. అంతకు ముందు తెలంగాణ ఏర్పాటుకు ముందు కూడా ఆహ్వానించినా ప్రతాప్ రెడ్డి నుండి ఎటువంటి స్పందన రాలేదు. కాగా గతేడాది టీడీపీని వీడి కాంగ్రెస్ లోకి చేరారు ప్రతాప్ రెడ్డి.