ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం...

SMTV Desk 2019-01-11 17:24:39  Hyedrabad, Outer ring road, Road accident, Car hits Ambulance

హైదరాబాద్, జనవరి 11: శుక్రవారం ఉదయం నగర శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల వద్ద రోగులను తరలిస్తున్న అంబులెన్సు కి ఎదురుగా వస్తున్న ఓ కారు అదుపు తప్పి ఢీకొట్టింది. తెల్లవారుజామున ముంచుకొస్తున్న నిద్రమత్తులోనే కారు డ్రైవర్ ఆగకుండా డ్రైవింగ్ కొనసాగించడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. ఔటర్ రింగ్ రోడ్‌ ఎగ్జిట్ 13 వద్ద శంషాబాద్ నుంచి బొంగులూరు వైపు వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి అంబులెన్స్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఏలూరు నుంచి ప్రాణాపాయ స్ధితిలో ఉన్న ఓ రోగిని అత్యవసర చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో హైదరాబాద్‌కు తీసుకువస్తుండగా ఆ ప్రమాదం సంబవిచింది. దీంతో అంబెలెన్స్ లో పేషంట్ అక్కడికక్కడే మృతి చెందాడు.

#video#