రైతు బజార్ లో హరీష్ రావు ??

SMTV Desk 2019-01-11 13:57:36  TRS MLA, Harish rao, Raithu bazar, Siddipeta raithu bazar

సిద్ధిపేట, జనవరి 11: తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఈ రోజు ఉదయం సిద్దిపేటలోని రైతు బజారు, సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనులను పరిశీలించారు. అనంతరం మార్కెట్ పనుల కోసం కంట్రాక్టర్లను ఆరా తీశారు. అంతేకాక రైతు బజారులోని కూరగాయల వ్యాపారులను, వినియోగదారులను ఆప్యాయంగా పలకరించారు.

మార్కెట్ సౌలభ్యంగా ఉందా..? కూరగాయల వ్యాపారులకు గిట్టుబాటు ధర లభిస్తుందా..? అని వారిని అడిగి తెలుసుకున్నారు. రైతుబజారులో చెత్త చెదారం కనిపించడం పట్ల హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని రైతు బజారు ఎస్టేట్ అధికారి ప్రభాకర్ ని హెచ్చరించారు.