రాజకీయ కోణంతో జిల్లాల స్థాపనకు మేము వ్యతిరేకం : రేవూరి

SMTV Desk 2017-07-28 14:59:51  REVURI PRAKAASH REDDY, NARSAMPET DISTRIC

వరంగల్, జూలై 28 : ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే రెండో అతిపెద్ద విద్యా కేంద్రంగా ఎదిగిన నర్సంపేటనే జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన రాజకీయ పరమైన కోణంతో జిల్లాలను స్థాపించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ప్రజల అభివృద్ధి పరంగా వారి సౌకర్యాలకు అనుగుణంగా నర్సంపేటనే జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరారు.