నగరంలో చెడ్డి గ్యాంగ్ హాల్ చల్

SMTV Desk 2019-01-05 19:44:13  Hyderabad, Cheddi gang, Thief's

హైదరాబాద్, జనవరి 5: మరోసారి నగరంలోకి చెడ్డి గ్యాంగ్‌ చొరబడింది. కేపిహెచ్‌బీ లిమిట్స్‌లోని మూడు కాలనీల్లో చెడ్డి గ్యాంగ్‌ దొంగతనానికి యత్నించింది. ఆ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు చెడ్డి గ్యాంగ్‌ను పట్లకునేందుకు ప్రత్నిస్తున్నారు. అంతేకాక చెడ్డి గ్యాంగ్ దొంగతనానికి పాల్పడిన విషయం తెలిసిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.