ప్రేమ వివాహం : కట్నం వేదింపులు

SMTV Desk 2019-01-05 17:31:31  Love marriage, Dowry, Harassment, Hyderabad

హైదరాబాద్, జనవరి 5: ప్రేమించి పెళ్ళిచేసుకొని తీరా మోజు తీరాక తనపై మానసిక వేదింపులకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. నగరంలోని రాజేంద్రనగర్ కి చెందిన దివ్యాంగురాలు లీలాకుమారి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ బేస్ పై కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తోంది. అదే కంపెనీలో శ్రీధర్ అనే వ్యక్తి అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. కాగా వీరిద్దరికీ 2010లో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. 2014 ఏప్రిల్ 20వ తేదీన రామాలయం గుడిలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. 18నెలల పాటు వీరి దాంపత్యం సాఫీగా సాగింది. అయితే వారి నుండి కట్నం కావాలంటూ శ్రీధర్, అతని తల్లి, చెల్లిలు లీలాకుమారిని వేధించడం మొదలుపెట్టారు.

అప్పుడు బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా వారు రాజీ కుదుర్చారు. తర్వాత మళ్లీ కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. విడాకులు ఇవ్వాలంటూ వేధించడం మొలుపెట్టాడు. తాను మరో వివాహం చేసుకుంటానని భార్య లీలా కుమారిని భర్త శ్రీధర్ తరచూ వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు మరోసారి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.