రికార్డు : @80 పెండింగ్ చలానాలు

SMTV Desk 2019-01-05 16:55:16  Hyderabad traffic police, Traffic rools, Helmet, Challans

హైదరాబాద్, జనవరి 5: నగరంలో వాహనదారులు చలనాలు కట్టకుండా ఎంత విచ్చల విడిగా తిరుగుతున్నారో తెలిసిన విషయమే. ట్రాఫిక్ రూల్స్ ఎంత కఠినంగా ఉన్నా వాహనదారులు మాత్రం తమదైన శైలిలో తప్పించుకు తిరుగుతున్నారు. ఈ మధ్య వొక వాహనంపై 60 పెండింగ్ చలానాలు ఉన్న ఓ వాహనాన్ని పట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా 80 పెండింగ్ చలానాలు ఉన్న మరో వాహనదారుడిని పోలీసులు పట్టుకున్నారు.

హైదరాబాద్ ప్యాట్నీ చౌరస్తా ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం తనిఖీలు చేపట్టగా.. ఈ వాహనదారుడు దొరికాడు. టీఎస్ 10ఈఎల్ 4152 నెంబర్ గల వాహనంపై వెళుతున్న విశాల్ అనే యువకుడుని ఆపి తనిఖీ చేయగా అతని వాహనంపై 80 పెండింగ్ చలానాలు ఉన్నట్లు తేలింది. వాహనదారుడి చలనాల మొత్తం రూ.12,630 ఉండగా వాటిని అతను చెల్లించిటనట్లు పోలీసులు తెలిపారు. వొక వాహనంపై ఇన్ని పెండింగ్ చలానాలు ఉండటం నగరంలో ఇదే మొదటిదని పోలీసులు తెలిపారు.