సంక్రాంతి తరువాతే మంత్రి వర్గ విస్తరణ ..!!

SMTV Desk 2019-01-05 12:23:12  TRS, Telangana assembly elections, KCR, CM, Ministers

హైదరాబాద్, జనవరి 5: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలై దాదాపు నెల రోజులవుతున్నప్పటికి ఇంత వరకు శాసనసభ సమావేశాలు నిర్వహించలేదు అటు మంత్రి వర్గం ఏర్పాటు చెయ్యలేదు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారాలు చేయించలేదు. రాష్ట్రంలో అసాధారణ పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడు జాప్యం జరుగడం సహజమే కానీ అత్యంత అనుకూల పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడు కూడా మంత్రివర్గం ఏర్పాటుకు ఇంత తాత్సారం జరుగుతుండటమే చాలా విచిత్రమే.

అయితే సంక్రాంతి పండుగ తరువాత 18వ తేదీన మంచిరోజు కనుక ఆ రోజున రాష్ట్ర మంత్రివర్గం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. సిఎం కేసీఆర్ ఇప్పటికే సీనియర్ తెరాస ఎమ్మెల్యేలతో మాట్లాడి వారిలో కొంతమందికి మంత్రిపదవులు, శాఖలు కూడా ఖరారు చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గం ఏర్పాటు చేసినరోజే కొంతమంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ పదవులపై న్యాయవివాదాలు జరిగిన నేపధ్యంలో వీటికోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం పరిశీలిస్తోంది.