ప్రాజెక్టుల సందర్శన బిజీ లో కేసీఆర్

SMTV Desk 2019-01-02 15:27:34  CM, KCR, Projects visiting, Mahadevpur, Pamphouse, Kannepally pamp house, Gravity canal

వరంగల్, జనవరి 2: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులను వీక్షించే క్రమంలో నిమగ్నులయ్యారు. ఈ సందర్శనలో భాగంగా కేసీఆర్ మహదేవ్‌పూర్‌ మండలంలోని పంప్‌హౌజ్‌కు చేరుకున్నారు. కన్నెపల్లి పంపుహౌస్‌కు సంబంధించిన గ్రావిటీ కెనాల్‌ పనులను ఆయన పరిశీలించనున్నారు. తరువాత అన్నారం బ్యారేజీ అదేవిధంగా పంప్ హౌస్ పనులను పరిశీలిస్తారు. అనంతరం ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం కింద చేపడుతున్న పనులను.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం రాజేశ్వరరావుపేట అలాగే మల్యాల మండలం రాంపూర్ వద్ద నిర్మాణ పనులను సీఎం పరిశీలించనున్నారు.