చికాగో సదస్సుకు ఆహ్వానమందుకున్న హరీష్ రావు

SMTV Desk 2017-07-27 16:20:36  AFMI INVITES IRIGATION MINISTER HAREESH RAO,

హైదరాబాద్, జూలై 27 : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను ప్రారంభించగా అందులో ప్రథమంగా "మిషన్ కాకతీయ" అంతర్జాతీయ మెప్పును అందుకుంటోంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టును నీతి ఆయోగ్, ఏఎఫ్‌ఎంఐ ప్రతినిధులు రజియా అహ్మద్‌, కుత్బుద్దీన్‌, ఏఎస్‌ నకాదర్‌ లు అభినందించారు. కాగా అమెరికాలోని చికాగోలో ఈ అక్టోబరులో జరగనున్న "భారత్‌ ఎదుర్కొంటున్న సవాళ్లు-లౌకికవాదం, బహుళత్వం" అనే అంశంపై జరగనున్న సదస్సుల్లో పాల్గొనడానికి నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావును భారతీయ సంతతి అమెరికన్‌ ముస్లిం సమాఖ్య(ఏఎఫ్‌ఎంఐ) ఆహ్వానించింది. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం 17 వేల చెరువులను పునరుద్ధరించి, ఈ ప్రాజెక్ట్ కింద 15 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం ప్రశంసనీయమంటూ కొనియాడారు.