మాజీ మంత్రి ఆకస్మిక పర్యటన ...!!

SMTV Desk 2018-12-29 12:48:55  Hyderabad, Etela rajender, Former minister, Muncipal office, MLA

జమ్మికుంట, డిసెంబర్ 29: నగరంలో శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో పాలకవర్గంతో పాటు వివిధ శాఖల అధికారులతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ నేను మెతక మనిషి అని చూసి చూడనట్లు వదిలి పెడుతారులే అనుకుంటే ఇకపై చెల్లదు ఇప్పటి వరకు వొక లెక్క ఇకపై మరో లెక్క ఉంటుందని, గ్రహించి పని చేయాలని అన్నారు. పట్టణ పరిధిలోని పంచముఖ హనుమాన్‌ ఆలయం, మోత్కులగూడెం, నాయిని చెరువు, దుర్గాకాలనీ, రాము హాస్పిటల్‌ ఏరియాలో పర్యటించారు. ఇటీవల వేసిన రోడ్లు, డ్రైనేజీలు, పైపులైన్ల కోసం తవ్వగా ఏర్పడిన గుంతలు ఇలా ప్రతి చిన్న సమస్యను పరిశీలించారు.