మరో యాగానికి సిద్దమయిన కేసీఆర్

SMTV Desk 2018-12-29 12:40:48  CM, KCR, TRS, Chandi yagam, Elections

హైదరాబాద్, డిసెంబర్ 29: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో యాగానికి సిద్దమవుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు, ప్రజాసంక్షేమమే లక్ష్యంగా కిందటి నెలలో రాజశ్యామల యాగాన్ని నిర్వహించిన కెసిఆర్‌ మరో బృహత్తర యాగాన్ని తలపెట్టారు. రాష్ట్రాభివృద్ధి, లోకకల్యాణం నిమిత్తం ఆయన మహారుద్ర సహిత సహస్ర చండీ మహా యాగం చేయనున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి సమీపంలో ఉన్న తన వ్యవసాయక్షేత్రంలో జనవరి 21 నుంచి 25 దాకా ఈ మహాయాగాన్ని నిర్వహించనున్నారు. మూడేళ్ల క్రితం వైభవోపేతంగా నిర్వహించిన అయుత చండీ మహాయాగం మాదిరిగానే ఈసారి కూడా శృంగేరీ జగద్గురువులు భారతీ తీర్థ స్వామి ఆశీస్సులతో, శృంగేరీ శారదాపీఠం సంప్రదాయంలోనే ఈ మహాయాగాన్ని నిర్వహించనున్నారు.