హైదరాబాద్ లో ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు

SMTV Desk 2018-12-29 11:50:45  Hyderabad, Gas connections, Pradhanamantri Ujwala yojana, Somajiguda, LPG Gas, Ashok kumar, Rajender reddy

హైదరాబాద్, డిసెంబర్ 29: నగరంలో దారిద్య రేఖకు దిగువన ఉన్న వారికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లును ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందజేస్తోందని హైదరాబాద్‌ జిల్లా హెచ్‌పీ గ్యాస్‌ నోడల్‌ అధికారి తరుణ్‌ కుమార్‌ అన్నారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రేటర్‌ ఎల్‌పీజీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అశోక్‌కుమార్‌, కార్యదర్శి రాజేందర్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.

హైదరాబాద్‌ జిల్లాలో 935 కనెక్షన్లు ఇచ్చామన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యువజన కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ 18002666696, జనరల్‌ టోల్‌ఫ్రీ నంబరు (గ్యాస్‌ సబ్సిడీ రాకపోవడం, తదితర ఫిర్యాదు చేయడానికి) 18002333555కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చన్నారు. హైదరాబాద్‌ జిల్లాకు సంబంధించి ఇబ్బందులు ఉంటే (తరుణ్‌కుమార్‌- 9550633999)కు చేయొచ్చన్నారు.