మసాజ్ సెంటర్ లో వ్యభిచారం...!

SMTV Desk 2018-12-24 12:35:37  Hyderabad city, Nacharam post office, Prostitution, Masaj parlour, Rachakonda police officers

హైదరాబాద్, డిసెంబర్ 24: నగరంలోని నాచారం పోస్ట్ ఆఫీస్ వెనుక వున్న మసాజ్ సెంటర్ లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులను రాచకొండ స్పెషల్ ఆపరేషన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం మసాజ్ సెంటర్ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందంటూ ఫిర్యాదు అందడంతో రాచకొండ పోలీసులు సదరు మసాజ్ పార్లర్‌పై నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మసాజ్ సెంటర్‌పై పోలీసులు దాడి చేశారు. దాడిలో భాగంగా ముగ్గురు మహిళలను రక్షించి.. స్పా యజమాని శ్రీరామ్‌, సిబ్బంది మణికంఠ, రాజేశ్‌లతో పాటు కస్టమర్లు నాగేశ్వరరావు, సంతోష్‌లను అదుపులోకి తీసుకున్నారు. రూ.7,570 నగదు, నాలుగు బిల్లు పుస్తకాలు, క్యాట్‌లాగ్, ఆరు సెల్‌ఫోన్లు, మూడు రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారు.