పట్టపగలే అత్యాచారానికి గురైన దివ్యాంగురాలు

SMTV Desk 2018-12-22 18:31:26  Handicaped women, Rape, Khammam city

ఖమ్మం, డిసెంబర్ 22: ఎర్రపాలెం మండలంలో ఓ కామాంధుడు పట్టపగలే దివ్యాంగురాలిపై అత్యచారినికి పాల్పడ్డాడు. తనపై అత్యాచారం జరుగుతున్నసమయంలో ఏమీ చేయలేక నరకం అనుభవించింది. తర్వాత తన తల్లి వద్దకు వెళ్ళి చివరికి ఎలాగోలా తను అనుభవంచిన నరకం గురించి తన సైగల సాయంతో వివరించింది. పోలీసుల వివరాల ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన ప్రకాశ రావు(35) అనే వ్యక్తి ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలం పెగళ్లపాడు గ్రామంలోని బంధువుల వద్దకు వచ్చాడు. కొద్ది రోజులుగా అక్కడే వుంటున్న అతడు ఓ బదిర యువతిపై కన్నేశాడు. బాలికకు మాటలు రావు కాబట్టి ఏం చేసినా ఎవరికి తెలియదని భావించి పట్టపగలే అఘాయిత్యానికి వొడిగట్టాడు.

ఇంట్లోంచి వొంటరిగా బయటకు వచ్చిన బాలికను గమనించిన నిందితుడు ఇదే అదునుగా భావించాడు. బాలికను బలవంతంగా దగ్గర్లోని పొలాల్లోకి లాక్కెళ్లి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఇంటికి చేరుకున్న బాలిక తల్లికి తనపై జరిగిన అఘాయిత్యం గురించి తెలిపింది. దీంతో ఇద్దరు కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.