పదవికి రాజీనామా చేసిన కొండా మురళి

SMTV Desk 2018-12-22 11:27:13  TRS, MLC, Kondaa murali

హైదరాబాద్, డిసెంబర్ 22: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కొండా మురళి తన పదవికి రాజీనామా చేస్తూ మండలి చైర్మన్ స్వామిగౌడ్ కు తమ రాజీనామా పత్రాన్ని అందించారు. 2014 ఎన్నికలకు ముందు కొండా సురేఖ దంపతులు టీఆర్ఎస్ లో చేరారు. ఇటీవల టీఆర్ఎస్ టిక్కెట్టు కొండా సురేఖకు దక్కలేదు. దీంతో కొండా సురేఖ దంపతులు టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ లో ఉన్న సమయంలో కొండా మురళి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

కాంగ్రెస్ పార్టీలో చేరినందున టీఆర్ఎస్ ద్వారా దక్కిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని కొండా మురళి నిర్ణయం తీసుకొన్నారు.ఈ మేరకు కొండా సురేఖతో కలిసి మురళి శనివారం నాడు శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్‌తో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు లేఖను మురళి స్వామిగౌడ్ కు అందించారు.