మద్యం మత్తులో వైద్యుల అశ్లీల నృత్యాలు

SMTV Desk 2018-12-22 11:17:54  Hyderabad, Resort partys, Doctors, Club dance, Shameerpet

హైదరాబాద్, డిసెంబర్ 22: మేడ్చల్ జిల్లాలోని ఓ రిసార్టులో నిన్న రాత్రి పలు హైప్రొపైల్ డాక్టర్లు మద్యం మత్తులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. వివరాల ప్రకారం హైదరాబాద్ శివారులోని శామీర్ పేట సెలబ్రిటీ రిసార్టులో పార్టీని ఏర్పాటు చేసుకున్న వైద్యులు కొందరు అమ్మాయిలను రప్పించుకుని అశ్లీల నృత్యాలకు, కార్యక్రమాలను సిద్దపడ్డారు.

అయితే పార్టీపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రిసార్టుపై దాడిచేసి అశ్లీల కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఈ దాడిలో ఏడుగురు డాక్టర్లను, నలుగురు అమ్మాయిలు పోలీసులకు పట్టుబడ్డారు. అలాగే భారీగా మద్యం, కండోమ్ పాకెట్లతో పాటు హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించడానికి వాడే మెడికల్ కిట్లు కూడా లభ్యమయ్యాయి. పట్టుబడిన డాక్టర్లంతా గజ్వెల్ ప్రాంతానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు.