వ్యభిచార గృహం నుండి బయటపడ్డ బాలిక

SMTV Desk 2018-12-21 17:28:33  Prostituting, Girl, Forced

జడ్చర్ల, డిసెంబర్ 21: నగరంలోని వ్యభిచార గృహంలో చిక్కుకున్న ఓ బాలికకు పోలీసులు విముక్తి కల్పించారు. మైనర్ బాలికకు మాయా మాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి మార్చేందుకు ప్రయత్నించిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైద్రాబాద్‌ చైతన్యపురిలోని ఎన్టీఆర్ నగర్ సమీపంలో మైనర్ బాలిక తల్లితో కలిసి నివాసం ఉంటుంది. అయితే ఆ బాలికకు చంటి అనే డ్రైవర్ అతని భార్య పుష్ప మాయా మాటలు చెప్పి ఈ నెల 10వ తేదీన జడ్చర్లకు తీసుకెళ్లారు.

వ్యభిచారం చేయాలని ఆ బాలికపై వొత్తిడి తెచ్చారు. జడ్చర్లలో చంటి భార్య మరికొందరు మహిళలతో వ్యభిచార గృహన్ని నిర్వహిస్తోంది.బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ నిర్వహించారు. ఈ విచారణలో చంటి మైనర్ బాలికను జడ్చర్లకు తీసుకెళ్లారని గుర్తించారు. పోలీసులు జడ్చర్లలో చంటి నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై దాడి చేశారు. మైనర్ బాలికతో పాటు ఏడుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో చంటి భార్య కూడ ఉన్నట్టు పోలీసులు తెలిపారు.