పూర్తైన చార్మి విచారణ

SMTV Desk 2017-07-26 17:35:09  Drugs Case, Heroin, Charmi, Sit, Officials, Inquiry

హైదరాబాద్, జూలై 26 : డ్రగ్స్ కేసులో ఈ రోజు హీరోయిన్ చార్మి ని విచారించిన సిట్ అధికారులు. ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు జరిగింది. ఈ విచారణ దాదాపు ఆరున్నర గంటలు వరకు జరిగింది. విచారణలో సిట్ అధికారులు చార్మిని కెల్విన్ తో ఉన్న సంబందాలు ఏంటి? కెల్విన్ కు 1000 మెసేజ్ లు ఎందుకు పంపారు? కెల్విన్ మొబైల్ లో మీ పేరును చార్మి దాదా గా ఎందుకు సేవ్ చేసుకున్నాడు? కెల్విన్ ఎలా పరిచయం, సేల్పి ఎందుకు దిగారు? జ్యోతి లక్ష్మి ఆడియో వేడుకకు కెల్విన్ ఎందుకు వచ్చాడు. ఇలా సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికి చార్మి సమాధానం చెప్పినట్లు తెలుస్తుంది. రేపు సిట్ అధికారులు ముమైత్ ఖాన్ ను విచారించనున్నట్లు సమాచారం.