పెథాయ్..ఆంధ్రప్రదేశ్, తెలంగాణలపై పెను ప్రభావం

SMTV Desk 2018-12-18 11:43:08  Pethai Cyclone

హైదరాబాద్ , డిసెంబర్ 18: పెథాయ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలపై పెను ప్రభావం చూపిస్తోంది. ఏపీలో కుండపోతగా వర్షాలు పడుతుంటే, తెలంగాణలో భారీగా చలిగాలులు వీస్తున్నాయి. ఈ శీతలగాలులతో తెలంగాణ అంతటా ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోయాయి. భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు, శీతలగాలులు ఏపీని అల్లకల్లోలం చేస్తున్నాయి.

తెలంగాణలోని కొన్ని జిల్లాలు అయితే మంచుముద్దను తలపిస్తున్నాయి. రాజధాని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. రంగారెడ్డి, మెదక్, వికారాబాద్, తాండూరు జనాలు 3 రోజులుగా వణికిపోతున్నారు. హైదరాబాద్, ఖమ్మంలో 17, మెదక్‌ 13, ఆదిలాబాద్ 14, తాండూరులో 8.3 డిగ్రీలు, నల్లగొండ, మహబూబ్‌నగర్, రామగుండంలో 18, హన్మకొండలో 15, నిజామాబాద్ 17 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుఫాన్ ప్రభావానికి తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి.